bjp plans to state wide protests: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ.. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bjp state president bandi sanjay) పార్టీ నేతలతో చర్చించారు. సంజయ్ పిలుపు మేరకు భాజపా సహా వివిధ మోర్చాలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇది షెడ్యూలు..
- నేడు, రేపు భాజపా కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో ఎడ్ల బండ్లపై ధర్నాలు చేపడతారు.
- డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో 33జిల్లాల కేంద్రాల్లో ప్లకార్డులు పట్టుకుని నల్లబ్యాడ్జిలతో నిరసన ప్రదర్శనలు చేపడుతారు.
- డిసెంబర్ 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని కూడళ్ల వద్ద కేసీఆర్ ప్రజావ్యతిరేక వైఖరిని చాటిచెప్పే బ్యానర్లతో భారీ నిరసన కార్యక్రమాలుంటాయి.
- డిసెంబర్ 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు..
- 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతారు.
- డిసెంబర్ 5న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో 6న తేదీన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపడతారు.
- 7న మైనార్టీ మోర్చా ధర్నా నిర్వహించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
అప్పటికీ దిగిరాకుంటే..
నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ తెరాస ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించకుంటే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు బండి సంజయ్ తెలిపారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగనున్న భాజపా