ETV Bharat / state

మరో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Telangana BJP MLA Candidates Fourt List Release

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 7:38 PM IST

Updated : Nov 9, 2023, 8:30 PM IST

18:15 November 09

మరో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Telangana BJP MLA Candidates Fifth List Release : ఇప్పటికే నాలుగు జాబితాల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ బీజేపీ.. నేడు ఐదో జాబితా(BJP MLA Candidates List)లో ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ ఆరుగురు అభ్యర్థులకు ఫోన్లు చేసి టికెట్‌ విషయాన్ని అధిష్ఠానం చెప్పింది. అలాగే రాత్రి వరకు బీజేపీ తుది అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా జనసేన(Janasena)కు 8 స్థానాలను కేటాయించింది. అయితే ముందుగా ప్రకటించిన వంద మందిలో చాంద్రాయణ గుట్ట అభ్యర్థి అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో మొత్తం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. ఇప్పుడు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మధిర, వికారాబాద్‌, నర్సంపేట, అలంపూర్‌, దేవరకద్ర, చాంద్రాయణ గుట్ట స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది.

ఆరు స్థానాలకు అభ్యర్థులు ఖరారు :

  • మేడ్చల్‌ - ఎన్‌.రామచంద్రరావు
  • నాంపల్లి - రాహుల్ చంద్ర
  • సంగారెడ్డి - పులిమామిడి రాజు
  • శేరిలింగంపల్లి - రవికుమార్‌ యాదవ్‌
  • పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్‌కుమార్‌
  • కంటోన్మెంట్‌ - కృష్ణప్రసాద్‌

12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల

బీజేపీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందించిన కిషన్‌రెడ్డి : బీజేపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుందని.. రాత్రికి 12 సీట్లకు దిల్లీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఏ పార్టీలో కనిపించని యువత.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియలో కనిపిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో బీసీ సామాజిక వర్గాల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని అన్నారు. దీపావళి తర్వాత బీజేపీ ప్రచారంలో మరింత ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.

Kishanreddy Fires on BRS and Congress : బీజేపీ హామీ ఇస్తే నెరవేర్చే పార్టీనని.. కానీ బీఆర్‌ఎస్‌ మోసపూరితమైన పార్టీనని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబం అక్రమ సంపాదన, నియంతృత్వ ధోరణి వల్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. కేసీఆర్‌ డబ్బుతో గెలుస్తాననే భ్రమతో ఉన్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల మీద నమ్మకం లేదని.. మాఫియా, అధికార దుర్వినియోగం మీద మాత్రమే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీల పేరుతో కర్ణాటక ప్రజలను ముంచేశారని వివరించారు. అలాగే తెలంగాణ ఆర్థిక మూలాలను కేసీఆర్‌ ధ్వంసం చేశారన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్పితే.. ప్రగతిభవన్‌ గోడలు దాటవని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏ మాత్రం పుంజుకున్న రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు మరొక్కసారి అధికారం ఇచ్చినా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని హెచ్చరించారు.

35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల

Telangana BJP MLA Candidate Second List : బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్​నగర్​ నుంచి రేసులో..

Last Updated : Nov 9, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.