BJP Maha JanSampark Abhiyan in TS : ఇందిరా గాంధీ గరీబీ హఠావో నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గతంలో ప్రభుత్వం రూపాయి పంపిస్తే లబ్ధిదారులకు 15 పైసలే అందేవని.. కానీ నేడు ప్రధాని మోదీ హయాంలో పూర్తి రూపాయిని వారికి అందేలా చేశారని వివరించారు. అందుకే డీబీటీ విధానంతో అవినీతికి తావులేకుండా లబ్దిదారుడికి మోదీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెలుతున్నామని బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ప్రధానిగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘావాల్ హాజరయ్యారు. కేంద్రం రూ.100 ఇస్తే.. లబ్ధిదారుకు రూ.15 కూడా చేరడం లేదని అర్జున్ రాం మేఘావాల్ అన్నారు. వివిధ దశల్లో జరుగుతున్న అవినీతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. అందుకే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే డబ్బులు వేస్తున్నామని వివరించారు. 2047 టార్గెట్‌గా మోదీ ప్రత్యేక విజన్‌తో పనిచేస్తున్నారని ఆయన వివరించారు.
Union Minister Arjun Ram Meghwal : కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణం అంతా అవినీతి అని అర్జున్ రాం మేఘావాల్ ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక ఇండ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడంతో.. నేరుగా లబ్ధిదారుకు ఫలాలు అందాయని చెప్పారు. ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని వివరించారు. దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేశామని.. ఈ క్రమంలోనే జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటు చేశామని అర్జున్ రాం మేఘావాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
BJP Maha JanSampark Abhiyan in Telangana : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కాషాయ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చర్యలు చేపట్టింది. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌ను అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు.. కార్యాచరణ రూపొందించుకుంది. ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు నెల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును ప్రజలకు వివరించనున్నారు.
"కేంద్రం రూ.100 ఇస్తే లబ్ధిదారుకు రూ.15 కూడా చేరడం లేదు. వివిధ దశల్లో జరుగుతున్న అవినీతిని కేంద్రం గుర్తించింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు వేస్తున్నాం. 2047 టార్గెట్‌గా మోదీ ప్రత్యేక విజన్‌తో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణం అంతా అవినీతి. మోదీ పాలనలో 3.5 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించాం." - అర్జున్ రాం మేఘావాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి
ఇవీ చదవండి: BJP Jan Sampark Abhiyan in TS : అధికారమే లక్ష్యంగా వ్యూహం.. జనం చెంతకు బీజేపీ