ETV Bharat / state

'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం'

హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెచ్చార్సీ ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య, కమిషన్​ సభ్యులు ఇర్ఫాన్​లకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పని చేస్తామని జస్టిస్​ చంద్రయ్య అన్నారు.

telangana bc sangam honor hrc chairman chandraiah in hyderabad
'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం'
author img

By

Published : Dec 29, 2019, 7:59 AM IST

రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా... తన శాయశక్తులా పనిచేస్తామని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని వివరించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి మానవ హక్కుల ఛైర్మన్​గా నియామకమైన జస్టిస్ చంద్రయ్య, కమిషన్ మెంబర్ ఇర్ఫాన్​లకు పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య, తెజస అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి... మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్​ చంద్రయ్య పేర్కొన్నారు. న్యాయానికి, మానవత్వానికి ప్రతిబింబం జస్టిస్ చంద్రయ్య అని ఆర్.కృష్ణయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారని... లోకాయుక్తగా, హెచ్చార్సీ ఛైర్మన్​గా అణగారిన వర్గాల వారిని నియమించడం హర్షనీయమన్నారు.

'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం'

ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.