Telangana Assembly Speaker Election Notification Released : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 13వ తేదీ సభాపతి ఎన్నిక(Speaker Election)కు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 13న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లును స్వీకరిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అంతకు ముందు ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు.
ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ అధిష్ఠానం శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar)ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆ పార్టీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్‌నే స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రసాద్ కుమార్‌కు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Election 2023)ల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు - గెజిట్ నోటిఫికేషన్ జారీ
Telangana Legislative Assembly : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈనెల 9న మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత అయిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్(Pro-tem Speaker)గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.
మంత్రులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీలుగా రాజీనామా చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 101 మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గైర్హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్లో కొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 ఎన్నికల్లో 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షం సీపీఐతో కలిసి 65 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 39 స్థానాల్లోనూ, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది.
అసెంబ్లీలో తొలిరోజు 100 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - బీజేపీ సభ్యుల గైర్హాజరు
తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం