Telangana Assembly Monsoon Sessions 2023 : ఎన్నికలు సమీపించడంతో అధికార బీఆర్ఎస్ దూకుడును మరింతగా పెంచింది. మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేసింది. రేపటి నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో వివిధ అంశాల్లో విపక్షాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది.
BRS Strategy for Telangana Assembly Sessions 2023 : రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాల అమలులో బీఆర్ఎస్ జోరు పెంచింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా అస్త్ర శస్త్రాల్నిసిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమపై సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తోంది.
విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేలా : శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై కసరత్తు జరిగింది. దీన్ని ఆమోదించే ముందు పూర్తి స్థాయిలో చర్చ జరుపుతారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. వ్యవసాయానికి ఉచిత, నిరంతర విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలతో పాటు ఆందోళనలూ చేసింది.
అసెంబ్లీలో నూఈ అంశంపై చర్చను లేవదీసి కాంగ్రెస్‌పై మరోసారి దాడి చేయాలని వ్యూహం పన్నింది. అలాగే.. బిల్లులను గవర్నర్ తిప్పిపంపిన వ్యవహారంలో బీజేపీను కేంద్రంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని శాసనసభలో మళ్లీ ప్రవేశ పెట్టనున్నారు.
BRS Candidates Telangana Assembly Elections 2023 : ప్రస్తుత ప్రభుత్వానికి మంత్రివర్గ సమావేశాలు మళ్లీ జరగడానికి అవకాశమున్నా... గురువారం నుంచి జరిగే శాసనసభ సమావేశాలే చివరివి కానున్నాయి. సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా బీఆర్ఎస్ తన మొదటి విడత అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 85 నుంచి 90 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు. నిర్ణయం తీసుకోలేక కొంతకాలం వేచి చూసే స్థానాలు తప్ప... మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
వరదలపై చర్చ : భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగి రైతులు నష్టపోవడంపైనా శాసనసభలో చర్చ జరగనుంది. దీనిపై ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముంది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, వారికి అనుకూలంగా ఎలా పని చేసిందో చెప్పడంతోపాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థికసాయంపైనా వివరాలను సిద్ధం చేస్తోంది. మొత్తం మీద రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత దూకుడు ప్రదర్శించి... ఎన్నికల రంగంలోకి దూకే అవకాశముంది.
ఇవీ చదవండి: