ETV Bharat / state

విధులతో పాటు బాధ్యతనూ నిర్వర్తిస్తాం - ఓటెత్తిన ప్రభుత్వాధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 12:00 PM IST

Telangana Assembly Elections Polling 2023 : తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ముఖ్య అధికారులందరూ పోలింగ్​ కేంద్రాల దగ్గరకు వెళ్లి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 'మా వంతు అయిపోయింది.. ఇక మీరే మిగిలారంటూ' ఓటర్లకు సందేశాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.

IAS Officers Casted Vote in Telangana
Telangana Assembly Elections polling today 2023

Telangana Assembly Elections Polling 2023 : తెలంగాణలో ఓటింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖ అధికారులంతా కుటుంబ సమేతంగా తమ పోలింగ్​ స్టేషన్​కు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పనిలో పనిగా పోలింగ్​ కేంద్రాల వద్ద సామాన్య ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారో.. లేదో అని పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటు వేసేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు తగు సూచనలు చేస్తున్నారు.

CS Shanthi Kumari Casted Vote in Telangana : హైదరాబాద్​లోని ప్రసన్ననగర్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌.. తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ స్టేషన్‌లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటు వేశారు. కొండాపుర్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్​లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) కుటుంబ సమేతంగా వెళ్లి.. వేలికి సిరాతో సందడి చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ ఓటు తెలంగాణ బతుకు చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలి - రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల సందేశం

Collectors Casted Vote in Telangana : నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 130వ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సతీసమేతంగా వెళ్లి.. తమ ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం(Polling Centers in Telangana) వద్ద సాధారణ ఓటరు మాదిరిగా వరుసలో వెళ్లి తన ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ నెంబర్ 245లో కలెక్టర్ జితేశ్​ పాటిల్ తన ఓటు వేస్తూ.. యువత ఓటు వేసేందుకు ముందుకు రావాలని, దీంతోపాటు పోలింగ్ కేంద్రాల్లో సాయం చేయాలని సందేశాన్ని ఇచ్చారు.

ఇట్స్ పోలింగ్ టైమ్ - 3.26 కోట్ల మంది సిరాచుక్కతో తీర్పు రాసే సమయం

Siddipet Collector Casted Vote in Telangana : సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ పోలింగ్ కేంద్రం 91లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్(Prasanth Jeevan Use Vote) పాటిల్, జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్​లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సహాయక కేంద్రాలు, వైద్య సిబ్బంది, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాలకు కరెంటు కష్టాలు - చీకటిలోనే ఓటింగ్​

ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్​ చేసేయ్​ - ఓటింగ్​ శాతాన్ని పెంచేయ్​

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.