ETV Bharat / state

తెలంగాణ ఎన్నికల బరిలో 2297 మంది అభ్యర్థులు - సీఎం కేసీఆర్​పై 83 మంది పోటీ - తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

Telangana Assembly Election Candidates 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. 2వేల 297మంది మిగిలారు. సీఎం కేసీఆర్‌ అత్యధికంగా పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డిలో 39 మంది బరిలో ఉన్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Election Nomination Withdrawal
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 8:32 AM IST

Updated : Nov 16, 2023, 8:43 AM IST

Telangana Assembly Election Candidates 2023 తెలంగాణ ఎన్నికల బరిలో 2297 మంది అభ్యర్థులు

Telangana Assembly Election Candidates 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. 2వేల 297మంది మిగిలారు. అత్యధికంగా అత్యధికంగా సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 44మంది, కామారెడ్డిలో 39మంది బరిలో ఉన్నారు. కేసీఆర్‌ పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 44మంది, కామారెడ్డిలో 39మంది బరిలో ఉన్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో స్వతంత్రులకు అధికారులు గుర్తులను కేటాయించారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణ గడువు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 297 మంది అభ్యర్థులు మిగిలినట్లు సమాచారం. ఈ నెల 13 న పరిశీలన అనంతరం 2వేల 898 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నంతో ఉపసంహరణల గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 601 మంది అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 297 మంది ఎన్నికల పోటీలో మిగిలారు. సగటున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 19 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సీఎం కేసీఆర్​పై హైకోర్టులో పిటిషన్ వేసిన బల్మూరి వెంకట్ - కారణమిదే

Candidates Contesting Against CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ బరిలో నిలిచిన గజ్వేల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 347 మంది అభ్యర్థులు పోటీపడబోతున్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ

Telangana Assembly Elections 2023 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 215 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 44మంది ఉపసంహరణ అనంతరం 200 మంది బరిలో ఉన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో 45 మంది అభ్యర్థులు పోటీనుంచి వైదొలిగారు. 9 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 144 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో స్వతంత్రులకు అధికారులు గుర్తులను కేటాయించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 30వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. 28న ప్రచారం ముగియనుంది.

శాసనసభ ఎన్నికల సమరం కీలక అంకానికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. ఉపసంహరణల గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాన్ని ఖరారు చేస్తారు. దీంతో ఇక ఎన్నికల సమరం తదుపరి ప్రక్రియ ఊపందుకోనుంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడనున్నారు. అధికారులు ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.

చివరి దశకు చేరుకున్న నామినేషన్ల ప్రక్రియ - పార్టీ గుర్తులు కేటాయించే పనిలో అధికారులు

నేతల ఫిర్యాదులపై ఈసీ నజర్​-జోరుగా పోలీసుల బదిలీలు

Last Updated : Nov 16, 2023, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.