Telangana Assembly Election Campaign : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గమంతా చుట్టేసేలా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు.. పరకాల మండలంలోని వెల్లంపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. రైతులను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్.. దామెర మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న.. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాయపర్తిలోని పలు గ్రామల్లో పర్యటించారు. వరుస రోడ్ షోలతో ఓటర్లను ఆకర్షిస్తూ తనను ఆశీర్వదించాలని కోరారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్కకు ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్‌లో రోడ్ షో, షెడ్యూల్ ఇదే
Telangana Assembly Election 2023 : అంబర్‌పేటలో ప్రచారం చేపట్టిన బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్.. బీఆర్ఎస్ స్కీములు.. స్కాములుగా మారాయని వెల్లిడించారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన జీవన్‌రెడ్డి.. ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వాకర్స్‌ని కలిసి ప్రచారం నిర్వహించారు. మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరిస్తూ అభ్యర్థి శ్రీధర్ బాబు.. ఓట్లు అభ్యర్థించారు. మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో.. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. నల్గొండలోని పలు వార్డులో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కోదాడలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్.. భారీ మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
'' తెలంగాణ ఏర్పాటు ఉద్యమమే నిరుద్యోగ యువత.. ఉద్యోగాలు భర్తీ చెయ్యటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందింది. తెలంగాణ యువతను సీఎం కేసీఆర్ మోసం చేశారు. పరీక్ష పేపర్లు అమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం" -జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి
ఇక వారం రోజులే గడువు - ఓటర్లను పేరు పేరునా పలకరిస్తున్న నాయకులు
BJP Election Campaign 2023 : ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎంపీ అరవింద్ రోడ్ షో నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. తనపై ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోవాలంటూ.. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాను డబ్బులకు అమ్ముడు పోయానని హరీశ్‌రావు చేసే వ్యాఖ్యలను తప్పుపడుతూ.. సిద్ధిపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పసుపు నీళ్లతో ప్రమాణం చేశారు. సిద్దిపేట ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని.. బీజేపీను గెలిపించాలని కోరారు.
ఆలోచించే ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీకే ఓటు వేస్తారు : చిట్ చాట్‌లో కేటీఆర్
రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం