ETV Bharat / state

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం: ప్రొ.నాగేశ్వర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని ఫ్రొ.నాగేశ్వర్ అన్నారు. ఈ ఎన్నికలను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప... సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని ఆరోపించారు.

author img

By

Published : Mar 9, 2021, 4:43 PM IST

team-professor-nageshwar-press-meet-for-mlc-elections-campaign-in-hyderabad
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం: ప్రొ.నాగేశ్వర్

త్వరలో జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ కోణంలో చూడొద్దని ప్రొ.నాగేశ్వర్‌ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం తప్ప సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో టీం నాగేశ్వరరావు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పలు సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి.

పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారే అవకాశం లేదని ఆయన గుర్తు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఫలితాలు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా వస్తాయన్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే 50 సంఘాలు తనకు మద్దతు ప్రకటించాయని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయని వివిధ సంఘాలకు చెందిన నాయకులు ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యలపై లోతైన అవగాహన, సమస్యల పరిష్కరం కోసం ప్రశ్నించే గొంతుక కావాలన్నారు. ఆ ప్రశ్నించే గొంతుకే ప్రొ.నాగేశ్వర్‌ అని వారు పేర్కొన్నారు.

మార్చి 14న జరగబోయే మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ప్రొ.నాగేశ్వర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.