ETV Bharat / state

విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. వారితో ఏం చేయించిందంటే?

teacher personal work with students: మొన్న శనివారం సాయంత్రం.. ఆ పాఠశాల విద్యార్థులు తమతమ ఆలోచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడం వల్ల విద్యార్థులంతా ఏమేమి చేయాలా అని రకరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇంతలో ఉపాధ్యాయురాలు నుంచి ఓ కబురు వచ్చింది.. ఆ సందేశం సారాంశం ఏమిటంటే.. ఆదివారం నాడు పిల్లలందరూ టీచర్​ గారి ఇంటికి రావాలని ఆర్డర్​.. దానిలో ఏముంది.. ఏ పుట్టినరోజు వేడుకనో.. ఏదో ఫంక్షన్​ అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.. ఇంతకీ ఆ పిల్లలను టీచర్​ తన ఇంటికి ఎందుకు పిలిచింది.. అక్కడికి వెళ్లిన పిల్లలు ఏమిచేశారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే...

work with students
work with students
author img

By

Published : Dec 6, 2021, 3:57 PM IST

Updated : Dec 6, 2021, 4:49 PM IST

teacher personal work with students: దేశ భవిష్యత్తు తరగతిగదిలోనే నిర్మితమవుతుందని ఓ మహానుభావుడు అన్నారు.​ బడి ఈడు పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి అంటోంది నేటి సర్కారు.. అయితే అలాంటి హిత బోధనలు చేసిన ఓ ఉపాధ్యాయురాలు పిల్లల్ని కూలీలను చేసింది. బడిలోని పిల్లల్ని భవన నిర్మాణ కార్మికులను చేసింది..

విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. వారితో ఏం చేయించిదంటే?

ఏపీలోని అనంతపురం జిల్లా గ్రామీణం మన్నీల గ్రామంలోని జిల్లా పరిషత్​ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శివమ్మ.. పాఠాశాలలోని విద్యార్థులను తన ఇంటికి రావాలని సూచించింది. అనంతపురంలోని ఆదర్శనగర్​లో ఆమె నిర్మించుకుంటున్న ఇంటి వద్దకు పిల్లలందరూ వెళ్లారు. అక్కడి వచ్చిన పిల్లలకు తలో పని అప్పజెప్పింది. కొందరు ఇటుకలు మోయడం, కొందరు సిమెంట్​ మోయడం, కలపడం పనులు చేయించింది. చేయమంటే టీచర్​గారు కొడతారో.. లేదంటే పరీక్షలో మార్కులు తక్కువ వేస్తారోనని భయంతో పిల్లలు.. టీచర్​ చెప్పిన పనల్లా చేశారు. పిల్లల్నే కాదు.. మున్సిపాలిటీకి చెందిన వస్తువులను వాడేసిందా టీచర్​.. చెత్త తరలించే బండ్లను ఇటుకలు తరలించడానికి ఉపయోగించుకుంది.. పిల్లల చేతిలో పుస్తకం పెట్టి అక్షరాలు నేర్పించాల్సిన టీచర్​.. వారి నెత్తిన తట్టలు పెట్టి ఇటుకలు మోయించింది. కూలీలెందుకు దండగ.. పాఠశాలలో పిల్లలు ఉండగా అనుకున్నట్లుంది.

పిల్లి కల్లు మూసుకుని పాలుతాగుతూ నన్నెవరూ చూడడం లేదనుకున్నట్లుగా.. తన చేసిన పని ఎవరికి తెలుస్తుంది అనుకున్న ఆ ఉపాధ్యాయురాలి చర్యను ఓ కెమెరా కన్ను కనిపెట్టింది. ఆమె నిర్వాకాన్ని చిత్రీకరించింది.. సామాజికమాధ్యమాల్లో చేరిన క్షణాల్లోనే వైరల్​ అయిపోయింది. ఇంకేముంది టీచరమ్మ తంతుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టీచర్​ వాడకం మామూలుగా లేదురా బాబు... వరాలివ్వడానికి దేవుడు దిగొస్తే అతడి నెత్తిన కూడా తట్ట పెడుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం కాస్తా జనాల ఫోన్లను దాటుకుని అధికారుల చెంతకు చేరింది.

ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్​ని వివరణ కోరగా.. తనకూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఈవో మీనాక్షి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చూడండి: drunk Headmaster : తాగి తూలుతూ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు.. ఆపై..

Last Updated : Dec 6, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.