రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని దేవున్ని ప్రార్థించినట్లు తెదేపా తెలంగాణ అధక్షుడు ఎల్ రమణ తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. అనంతరం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగినప్పుడే విజయం లభిస్తుందని ఎల్ రమణ అన్నారు. కొవిడ్ మహమ్మారి రెండో దశ విస్తరిస్తున్నందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: టీకా వేయించుకున్నా నిబంధనలు పాటించాలి: ఎర్రబెల్లి