బడ్జెట్‌పై ఇరు రాష్ట్రాల అధినేతల అభిప్రాయాలను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై కేంద్రానికి డిమాండ్ పెట్టకుండా నిధులు రాలేదనటం సమంంజసం కాదని ఇరు రాష్ట్రాల నాయకులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం డిమాండ్ పెట్టకుండా ఆరోపణలు ఎలా చేస్తారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు అడిగారని... అప్పుడే జాతీయ హోదా ఎందుకు అడగలేదని రావుల ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఏమడగాలో స్పష్టత లేదన్నారు.
కేంద్ర బడ్జెట్ సామాన్యులపై భారంపడే విధంగా ఉందని రావుల పేర్కొన్నారు. నిరుపేదలు వాడే వస్తువులపై పన్నుల వసూళ్లు సరికాదన్నారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే క్రమంలో మధ్య తరగతి, సామాన్యులను దృష్టిలో ఉంచుకోవాలని రావుల సూచించారు. కోట్ల రూపాయలు చెల్లించని వారిపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కోసం ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు.