NTR Statue Removed: ఏపీలోని చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై టీడీపీ నేతలు తప్పుపట్టారు. విగ్రహం తొలగించడం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అసమర్థత పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైకాపా నాయకులు వికృతానందం పొందుతున్నారని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తిపైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి :