ETV Bharat / state

ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి - kishan reddy on state funds

రాజస్థాన్​లో చిక్కుకున్న విద్యార్థుల విషయంపై మంత్రి కేటీఆర్​తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు కేంద్రం సహకరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Talking to KTR
కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి
author img

By

Published : Apr 29, 2020, 11:22 AM IST

Updated : Apr 29, 2020, 11:37 AM IST

రాజస్థాన్‌ కోటలో చిక్కుకున్న విద్యార్థుల విషయంపై పురపాలక మంత్రి కేటీఆర్‌తో మాట్లాడినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఏపీ విద్యార్థులను తీసుకెళ్లేందుకు కేంద్రం సహకరిస్తోందని స్పష్టం చేశారు. రెండో విడత కేటాయించిన బియ్యాన్ని రాష్ట్రాలు తీసుకెళ్లాలని ఆయన వివరించారు. రాష్ట్రానికి ఎఫ్‌సీఐ నుంచి 95,810 మెట్రిక్ టన్నుల బియ్యం పంపించిట్లు పేర్కొన్నారు.

ఆ బియ్యం తీసుకెళ్లి పేదలకు పంపిణీ చేయాలని రాష్ట్రాలను కోరినట్లు ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన పప్పుధాన్యాలను కొన్ని రాష్ట్రాలు తీసుకెళ్లలేదన్నారు. రాష్ట్ర రైతులకు రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.659 కోట్లు ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రైతుల ఖాతాల్లో నేరుగా రూ.2 వేల చొప్పున జమ చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణలోని జన్‌ధన్‌ ఖాతాల్లో ఇప్పటికే రూ.263 కోట్లు జమ చేసినట్లు వివరించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.126 కోట్లు, తెలంగాణ ఉద్యోగుల పీఎఫ్‌ కోసం రూ.207 కోట్లు, రాష్ట్ర విపత్తు నిధి కింద తెలంగాణకు రూ.224 కోట్లు, వైద్య పరికరాలు, కరోనా ప్రత్యేక ఆస్పత్రుల నిర్వహణకు రూ.215 కోట్లు ఇచ్చిట్లు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

Last Updated : Apr 29, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.