Deccan Mall Fire Incident: గోదాముల్లో ప్రమాదకర అగ్నికి ఆహుతయ్యే రసాయనాలు, రెక్సీన్, ఇతర సామాగ్రి నిల్వ చేసే వారిని ఉపేక్షించేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత 35 సంవత్సరాలుగా నడుస్తున్న తంతు కారణంగా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం, భవనం కూల్చివేత కారణంగా దెబ్బతిన్న స్థానికుల ఇళ్లకు మరో నెల రోజులు లోపే మరమ్మత్తులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికంగా ఉన్న కాలనీలో పర్యటించి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో గత నెల 19న దక్కన్మాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ అగ్ని ప్రమాదం సంభవిcచడంతో ఈ భవనం నాణ్యత లోపించడం కారణంగా దీన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్ ఇవ్వగా.. రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పని దక్కించుకుంది.
మాల్ కూల్చివేతకు యంత్ర సామగ్రితో సిద్ధమైంది. సాయంత్రానికి జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఎస్.కె క్రాంటాక్టును రద్దు చేసింది. టెండరులో పాల్గొని రూ.33లక్షలకు పని చేస్తామన్న మాలిక్ ట్రేడర్స్‌కు పని అప్పగించింది. గుత్తేదారు పొడవైన జేసీబీని తెచ్చి పనులు ప్రారంభించారు. పనులు వేగవంతంగా చేసిన సంస్థ.. ఈరోజు ఎట్టకేలకు దక్కన్ మాల్ భవనాన్ని ఎలాంటి అపాయం లేకుండా నేలమట్టం చేశారు.
ఇవీ చదవండి: