ETV Bharat / state

CS: 'సరిహద్దు గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టండి' - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్ కుమార్

రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సీఎస్​ సోమేశ్​ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో సరిహద్దు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు.

cs somesh kumar
సీఎస్​ సోమేశ్​ కుమార్
author img

By

Published : Jun 7, 2021, 5:01 PM IST

Updated : Jun 7, 2021, 5:25 PM IST

కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్ కుమార్ సూచించారు. వైరస్​ వాప్తి అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్​, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్​వోలు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో చర్చించారు.

ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో కొవిడ్ పరిస్థితి, టెస్టులు, పాజిటివిటీ రేటు, ఆస్పత్రులలో బెడ్ల ఆక్యుపెన్సీపై ఆరా తీశారు. జిల్లాల వారిగా కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వైరస్ నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Vaccine : మిర్యాలగూడలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్​ వద్ద ప్రజల ఇబ్బందులు

Last Updated : Jun 7, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.