సముద్రాన్ని ఈదాలనుకోవటం తప్పంటారు పెద్దలు. అయితే పట్టుదల ఉంటే అవలీలగా ఈదెయ్యెచ్చంటున్నారు మన తెలుగింటి ఆడపడుచు గోలి శ్యామల. 43 ఏళ్ల వయసులో రామసేతును ఈది రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన రెండో మహిళ మన హైదరాబాద్కి చెందిన శ్యామలే కావడం విశేషం.
పాక్ జలసంధిగా పిలిచే రామసేతును ఈదటం అత్యంత కష్టమైందని.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ తెలిసినవారు స్నేహితులు వారించినా పట్టు వీడలేదు ఆమె. అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ఇటీవలే పాక్ జలసంధిని కేవలం 13 గంటల 43 నిమిషాల్లో ఈదారు. ఈ నేపథ్యంలో గోలి శ్యామలతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: కరోనా వేళ.. హోలీ ఇలా ట్రై చేయండి!