ETV Bharat / state

ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు - Supreme Court hearing on LRS

supreme court of india hearing petitions upon lrs scheme
ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు
author img

By

Published : Dec 16, 2020, 12:00 PM IST

Updated : Dec 16, 2020, 12:52 PM IST

11:57 December 16

ఆ మూడు రాష్ట్రాలు సహా కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆ మూడు రాష్ట్రాలు సహా.... ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై జనగాంకు చెందిన జువ్వాడి సాగర్‌ రావు వ్యాజ్యం వేశారు. అక్రమ లేఔట్లతో వరదలు సహా పలు సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, చెన్నైలో వచ్చిన వరదలే రుజువులని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాట్లు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారన్న పిటిషనర్‌.. అక్రమాలకు పాల్పడిన స్థిరాస్తి వ్యాపారులను వదిలేస్తున్నారని చెప్పారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం.... తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు సహా ప్రతివాదులైన నోటీసులు ఇచ్చింది.

Last Updated : Dec 16, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.