ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించేలా కోర్డులో పని వాతావరణం ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సికింద్రాబాద్‌లో సిటీ సివిల్ కోర్టు భవనాలను ప్రారంభించిన ఆయన... సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల ఛాంబర్ల కంటే ఇక్కడి ఛాంబర్లు బాగున్నాయని కొనియాడారు. సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం అడ్వకేట్లకు ఉందన్నారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే విచారణ సులభమవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే...