శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని (arasavalli Suryanarayana Swamy Temple)సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు 9 నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.
కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున బారులుదీరారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆనందంగా ఉంది
ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నా కుదరలేదు. ఎప్పుడూ టీవీలలో చూడటమే. బంగారు ఛాయలోకి మారిన తరువాత మూలవిరాట్‌ను చూస్తూ ఉండిపోయాను. - సూర్యం, హైదరాబాద్
ఆ భాగ్యం చూడగలిగా..
కిరణాలు పడుతున్న వేళ స్వామివారు బంగారు రంగులో మెరిసిపోయారు. వేకువజామున పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో దర్శనభాగ్యం కలగదేమోనని అనుకున్నా. ఎట్టకేలకు ఆ భాగ్యం చూడగలిగా. - లిఖిత, రాజమండ్రి
ఇవీ చూడండి:
- Telugu academy scam: తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు... నలుగురు అరెస్ట్
- Telugu Academy Deposit Scam: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో మొత్తం నలుగురు అరెస్ట్
- Scam In Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌పై సీసీఎస్ దర్యాప్తు
- Scam In Telugu Academy: మలుపులు తిరుగుతున్న కేసు.. దర్యాప్తులో కొత్త కోణాలు
- Fixed Deposits Scam In Telugu Academy: ఎఫ్‌డీల్లో మాయాజాలం.. విత్‌డ్రా చేసిందెవరు? ఫోర్జరీ జరిగిందా?