ETV Bharat / state

అశ్లీలానికి ప్రభావితమై నేరస్థులుగా మారుతున్న విద్యార్థులు - Telangana news

సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమవుతన్న అసభ్య, అశ్లీలాలకు కొంతమంది విద్యార్థులు, మైనర్లు ప్రభావితులై నేరస్థులుగా మారుతున్నారు. తెలిసి తెలియని వయసులో వారి మనసుకు ఏదితోస్తే అది చేసేస్తున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులైతే తప్పుచేస్తే ఏమవుతుందో చూద్దామని నిర్ణయించుకుని నీలిచిత్రాల వీడియోలను పంపుతున్నారు. పొరుగునే ఉండేవారు.. అపార్ట్‌మెంట్స్​లో ఉంటున్నవారు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండడంతో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

Social
Social
author img

By

Published : Apr 28, 2021, 12:52 PM IST

ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు పాఠశాలలు మెయిల్ ఐడీని సృష్టించుకోవాలన్న నిబంధనను కొందరు విద్యార్థులు అవకాశంగా మలుచుకుంటున్నారు. జీ మెయిల్‌ ఐడీలతో పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఖాతాలను తమ పేర్లు, మారు పేర్లతో ప్రారంభిస్తున్నారు. మీరు 18 ఏళ్లు ఉన్నారా అన్న ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చి ఖాతాలను ప్రారంభిస్తున్నారు. అందులో ఇష్టమైన ఐచ్ఛికాలను ఎంచుకుంటున్నారు.

ఐపీ చిరునామా తొలగిస్తూ…

తరగతులు లేనప్పుడు విరామ సమయాల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఖాతాలను వినియోగించి స్నేహితులకు సందేశాలు పంపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అశ్లీల వీడియోలను చూస్తూ తమ స్నేహితులకు పంపుతున్నారు. ఇతర మెయిల్‌ ఐడీల ద్వారా కొత్తవారికి, పరిచయమున్న యువతులకు పంపుతున్నారు. తాము పంపుతున్నామన్న అనుమానం రాకుండా ఎలా పంపాలనే విషయంపై గంటల తరబడి ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులైతే ఒక అడుగు ముందుకేసీ ఐపీ చిరునామాలు సైతం తొలగిస్తున్నారు.

తప్పులు…

మైనర్లు, విద్యార్థులు చేస్తున్న నేరాల కారణంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ధి రోజుల క్రితం ఓ యువతి పెళ్లి రద్దుకాగా.. ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పంపించారంటూ వైద్య విద్యార్థినికి ఉన్నతాధికారులు టీసీ ఇచ్చి పంపుతామంటూ హెచ్చరించారు. వాస్తవానికి ఆమె ఇంటి పక్కనున్న మైనర్‌ విద్యార్థి ఆమె ఈ మెయిల్‌ ఖాతా వివరాలు తెలుసుకుని ఇదంతా చేశాడు. బోయిన్‌పల్లికి చెందిన ఒక యువతి తనను అకారణంగా ఒకరు వేధిస్తున్నారని, ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అశ్లీలంగా మార్చి తన బంధువులు, స్నేహితులకు పంపుతున్నారని... నెలన్నర క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమెకు నిశ్చితార్థమైంది.

శిక్ష తప్పనిసరి

పోలీసులు దర్యాప్తు చేపట్టగా వారింట్లో పైన అద్దెకుంటున్న బీటెక్‌ విద్యార్థి ఇలా చేశాడని గుర్తించారు. వినయంగా ఉండే విద్యార్థి అలా చేశాడంటే యువతి, ఆమె తల్లి తొలుత నమ్మలేదు. పోలీసులు ఆధారాలు చూపించాక అతడిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న పిల్లలైనా, విద్యార్థులైనా శిక్షలు ఖాయమని.. మూడేళ్లపాటు జువైనల్‌హోం, జైళ్లలో ఉండాల్సిందేనని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.