ETV Bharat / state

ప్రకృతితో ఆరోగ్యం + ప్రతిరోజూ ఆహ్లాదం @ ప్లాంట్ బాక్స్! - గ్రీన్​నౌ సంస్థ వ్యవస్థాపకుడు మాచర్ల రాహుల్​

ఆహ్లాదం పంచుతూ...ఆరోగ్యం పెంచుతూ...అనేక రకాలుగా ఉపయోగపడే మెుక్కల్ని పెంచాలని చాలామందికి ఉంటుంది. పూల, పండ్ల మెుక్కల్ని ఇంటి ఆవరణలో పెంచేందుకు ఆసక్తి ఉన్నా...ఉద్యోగ, వ్యాపార, వృత్తి రీత్యా తీరిక లేక మెుక్కల పెంపకానికి సమయం కేటాయించలేకపోతున్నారు. మెుక్కలకు కనీస అవసరమైన నీటిని రోజూ అందించలేక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ప్రకృతి ప్రేమికుల ఈ సమస్యకు పరిష్కారం చూపింది.. ఓ యువకుడి వినూత్న ఆలోచన. ప్లాంట్‌ బాక్స్‌ పేరిట రూపుదిద్దుకున్న ఈ నయా ఆవిష్కరణ... మెుక్కల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది.

green now
ప్రకృతి ప్రేమికుల సమస్యకు పరిష్కారం.. ఈ ప్లాంట్​ బాక్స్​..
author img

By

Published : Jan 23, 2021, 2:16 PM IST

ప్రకృతి ప్రేమికుల సమస్యకు పరిష్కారం.. ఈ ప్లాంట్​ బాక్స్​..

అవసరం ఎలాంటిదైనా.. అవరోధం ఎంత పెద్దది అయినా పరిష్కారం మాత్రం ఆవిష్కరణలే. అలాంటి అరుదైన ఆవిష్కరణతోనే ఆకట్టుకుంటున్నాడు...హైదరాబాద్ యువకుడు మాచర్ల రాహుల్‌. మెుక్కలకు నీటి కొరత సమస్య తీర్చేందుకు, అన్నదాతలకు తనవంతు సాయం చేసేందుకు ప్లాంట్‌ బాక్స్‌ అనే సెల్ఫ్‌ ఇరిగేషన్ బాక్స్‌ రూపొందించాడు.

నీటి సమస్యకు చెక్​

రాహుల్.. విస్తృత అధ్యయనం తరువాత ఈ ప్లాంట్‌ బాక్స్‌ రూపొందించాడు. మొక్కలు నాటేటప్పుడు 5 లీటర్ల నీరు పట్టే ఈ బాక్స్‌ అమర్చేలా తయారుచేశాడు. ఒక్కసారి నీటిని పోస్తే నెల రోజుల వరకూ మళ్లీ నీరు పోయాక్కర్లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు..రాహుల్‌. హరితహారం, వనం మనం కార్యక్రమాలకు ఎదురవుతున్న నీటి సమస్యకు తన ఆవిష్కరణతో చక్కని పరిష్కారం చూపాడు.

సమయం ఆదా

మెుక్కలకు అవసరమైన నీరు అందించటమే కాక విలువైన సమయం ఆదా చేసేలా తయారు చేసిన ప్లాంట్‌ బాక్స్‌ వినియోగానికి రైతులు సహా అన్నివర్గాల వారు ఆసక్తి చూపిస్తున్నారు. వర్షాభావ సమస్య ఉన్న ప్రాంతాల్లోని పండ్ల తోటల పెంపకానికి చక్కగా ఉపయోగపడుతుందంటున్నాడు.. రాహుల్‌ . రోడ్లపై నాటే మొక్కలు, ఇంటి పెరట్లోని కూరగాయలు, పండ్లు, పూల మొక్కల సంరక్షణకు దోహదపడుతుందంటున్నాడు.

ప్లాంట్​ బాక్స్​

ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ వర్సిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ చేసిన రాహుల్‌..అక్కడే రెండేళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అయితే ఆరంకెల వేతనం, విలాసవంతమైన జీవితం అతడికి సంతృప్తి ఇవ్వలేదు. స్వదేశం వచ్చి రైతులకు సేవ చేయాలకున్నాడు. వెంటనే భారత్ వచ్చి సరి కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాడు. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి ప్లాంట్ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చాడు.

విక్రయాలకు శ్రీకారం

2019 ఫిబ్రవరిలో హైదరాబాద్ కేంద్రంగా తన మిత్రులు వంశీ, కృష్ణ, మహర్షితో కలిసి గ్రీన్‌ నౌ అనే అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు..రాహుల్‌. ఆన్‌లైన్ వేదికగా విక్రయాలకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు సేవల్ని విస్తరింపజేశాడు. రైతులు, శాస్త్రవేత్తలను కలిసి ప్లాంట్‌ బాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ..ప్లాంట్‌ బాక్స్‌ను అన్నదాతలతో పాటు అందరికి చేరువ చేస్తున్నాడు.

90శాతం నీరు ఆదా

సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ క్రీడా ప్రాంగణంలో కొన్ని మొక్కలు నాటిన శాస్త్రవేత్తలు...ప్లాంట్‌ బాక్స్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. 90% నీరు ఆదా అవడమే కాక, పెరుగుదలలోనూ మార్పు వచ్చినట్లు ధృవీకరించారు. తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకులు కార్యాలయ ప్రాంగణంలోనూ ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఉద్యాన శాఖ అధికారులు సైతం పనితీరుకు కితాబు ఇచ్చారు.

మంచి దిగుబడులు

జీహెచ్‌ఎంసీ పరిధి సహా సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలువురు రైతులు, గృహ యజమానులు ఈ సాంకేతికత అందిపుచ్చుకుని సత్ఫలితాలు పొందుతున్నారు. పరిమిత నీటి వనరులతోనే మంచి పంట దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు. అందరికి అందుబాటులో ఉండే 99 రూపాయల కనీస ధరతో అన్నివర్గాలు వారిని ప్లాంట్‌ బాక్స్‌ వినియోగం వైపు మళ్లించటంలో రాహుల్ విజయం సాధించాడు. పర్యావరణ సంరక్షణలోనూ పాలుపంచుకుంటున్నాడు.

ఇదీ చూడండి: 'ది కమర్షియల్‌ సినిమా'కు అక్షర రూపమిచ్చాడీ కుర్రాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.