ETV Bharat / state

విష జ్వరాల పంజా.. ప్రజలు గజగజ - ఒళ్లు నొప్పు

విష జ్వరాలు రాష్ట్రంలో పంజా విసురుతున్నాయి. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ ఫీవర్లతో ప్రజలు మంచం పడుతున్నారు. మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, డిఫ్తీరియా..  వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలతో పాటు, భాగ్మనగరంలోనూ ప్రజలు ఆస్పత్రుల బాటపడుతున్నారు.

విష జ్వరాల పంజా.. ప్రజలు గజగజ
author img

By

Published : Aug 13, 2019, 11:28 PM IST

విష జ్వరాల పంజా.. ప్రజలు గజగజ

రాష్ట్రంలో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పితో తల్లడిల్లుతున్నారు. సీజనల్​ వ్యాధులతో మంచాన పడుతున్నారు. హైదరాబాద్​తో పాటు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. జ్వరాల చికిత్స కోసం ప్రత్యేకంగా నల్లకుంటలో ఏర్పాటుచేసిన ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఒక్క మంగళవారమే సుమారు 2వేల మందికి పైగా రోగులు ఆస్పత్రికి వచ్చారు. సాధారణంగా మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉండే ఓపీల సంఖ్య గత నెల నుంచి వెయ్యికి చేరుతోంది.

మరోవైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క గాంధీలోనే గత నెలలో 400 మంది ఇన్ పేషంట్లుగా చేరారు. ఇక ఉస్మానియాలోనూ పరిస్థితి అలానే ఉంది. జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో డెంగ్యూ లక్షణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. గత నెలలో గాంధీ ఆస్పత్రిలో సుమారు 70 మంది డెంగ్యూ చికిత్స తీసుకున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోనూ ప్రస్తుతం 20 మంది డెంగ్యూతో చికిత్స పొందుతున్నారు. వీరిలో బాలింతలు, ఏడేళ్లలోపు చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే విషజ్వరాల పంజా నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 394 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అధికంగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోనే నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,981 మలేరియా కేసులు నమోదుకాగా.. ఖమ్మంలో అధికంగా 1,489, ఆదిలాబాద్​లో 904, వరంగల్​లో 188 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 54 చికెన్ గున్యా కేసులు నమోదు కాగా మహబూబ్​నగర్​లో 27, ఆదిలాబాద్​లో 18 కేసులు నమోదయ్యాయి. మొత్తం 230 ఫైలేరియా కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డిలో 126, ఖమ్మంలో 57, ఆదిలాబాద్​లో 37 మంది ఫైలేరియా బారిన పడ్డారు.

డెంగ్యూ , చికెన్ గున్యా కేసులు అధికంగా నమోదవడం వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. రూ.7 కోట్లతో 25 ప్లెట్​లెట్​ వేరియేషన్​ మిషన్లను ఆస్పత్రులో ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. 200 పడకల ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు ఉన్న చోట వీటిని ఏర్పాటు చేయనున్నారు..

ఇవీ చూడండి: కర్షకుడే కాడెత్తితే... పుడమి తల్లి పండదా!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.