సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తోడ్పాటును అందించడమే నిజమైన సేవ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హెల్పింగ్ హార్ట్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సేవ నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జీవితంలో నలుగురి ప్రేమను సంపాదించుకోవడం అన్నింటికన్నా ముఖ్యమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మనం చేసే మంచి పనుల వల్లనే అది సాధ్యమవుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా, ఆరోగ్య, సినీ రంగాలలో సేవలందించిన పలువురిని 'సేవ నంది అవార్డు'లతో సత్కరించారు. అవార్డులు పొందినవారు మరింత ఉత్సాహంతో సమాజ సేవ చేయాలని మంత్రి కోరారు.
ఇదీ చదవండి: ఈ బురిడీ బాబా.. బతుకులు బాగు చేసే దేశ గురువట!