రాష్ట్ర గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం నూతన అధ్యక్షులుగా కేశం నాగరాజు తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో గౌడ కులస్థుల జనాభా పూర్తి స్థాయి లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవని, జిల్లాలు , మండలాలు, గ్రామాలలోని సంఘాల ద్వారా త్వరలో జనగణన చేపట్టనున్నట్లు అధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు. గౌడ కులస్థుల సత్తా చాటేలా త్వరలోనే రెండు లక్షల మందితో సికింద్రాబాద్ జింఖానాగ్రౌండ్ లో మాహాగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :'పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం'