కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలనే మనసు కొందరికే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సారిపల్లి కొండల్రావు.. నిరుపేద కళాకారులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో.. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 5 మందికి.. రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. మరో 100 మంది జానపద కళాకారులకు.. రూ.1000 చొప్పన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
కరోనా సంక్షోభంలో.. తన చేతుల మీదుగా సహాయం అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు రమణాచారి తెలిపారు. సారిపల్లిని స్ఫూర్తిగా తీసుకొని.. మరికొంత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షులు బొప్పన నరసింహారావు, తెలంగాణ జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు వంగా శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం