ETV Bharat / state

Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై నేడు ప్రణాళిక విడుదల - Government Plan on Telangana Decade Celebrations

Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. జూన్​ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని 21రోజులు పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్​ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ 21రోజుల్లో ఏ రోజున ఏ కార్యక్రమం చేయాలనేదానిపై ప్రభుత్వం ఇవాళ ప్రణాళిక ప్రకటించనుంది.

Telangana formationday Celebrations
Telangana formationday Celebrations
author img

By

Published : May 23, 2023, 6:53 AM IST

Updated : May 25, 2023, 1:39 PM IST

Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించనుంది. జూన్ రెండో తేదీ నుంచి 21రోజుల పాటు వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజులపాటు ఆయా రంగాల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు.

Telangana Decade Celebrations Action Plan : అందుకు అనుగుణంగా అన్ని శాఖలు తమ శాఖల పరంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశాయి. వాటిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని వ్యవసాయశాఖ కోరింది. అంగన్ వాడీలు, మహిళా సమాఖ్యల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని మహిళా-సంక్షేమ శాఖ, గురుకులాల వద్ద కార్యక్రమాలు చేపట్టాలని సంక్షేమ శాఖలు ప్రతిపాదించాయి.

Telangana formation day Celebrations 2023 : మిగతా శాఖలు కూడా ప్రతిపాదనలు రూపొందించాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరోదఫా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి ఉత్సవాల ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

ఉత్సవాల లోగో.. ఇవే ప్రత్యేకతలు : మరోవైపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి లోగోను సోమవారం రోజున సీఎం కేసీఆర్​విడుదల చేశారు. ఈ లోగోలో, దశాబ్ది ఉత్సవాల్లో పది సంఖ్యకు ప్రాధాన్యతనిచ్చారు. పది సంఖ్యలోని ఒకటిలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల చిత్రాలను పొందుపరిచారు. పుష్పం ఆకారంలోని సున్నా నమూనా మధ్యలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని డిజైన్ చేశారు.

తెలంగాణ తల్లి చుట్టూ ప్రభుత్వ పథకాలను పేర్చారు. రైతుబంధు, ఉచిత విద్యుత్, నీటిపారుదల, మిషన్ భగీరథలకు సంబంధించిన చిత్రాలను ఉంచారు. అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకం, టీహబ్, పోలీస్​ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ మెట్రో రైల్, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆయాలను లోగో చుట్టూ రూపొందించారు. పది సంఖ్య కింద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014-2023 అని రాశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.