ETV Bharat / state

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి

author img

By

Published : Nov 30, 2020, 8:56 PM IST

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ec
ec

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్ల పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి ఇబ్బందికరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవాళ రాత్రి అత్యంత కీలకమని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ విషయంలో ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలను అప్రమత్తం చేయాలని పేర్కొంది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే స్పందించి చట్టప్రకారం కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇదీ చదవండి : గ్రేటర్‌ పోరుకు ఏర్పాట్లు పూర్తి.. బరిలో 1,122 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.