కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లేఖ రాసింది. దుబ్బాక ఉపఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిలతో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరాకు ఆయన మంగళవారం లేఖ రాశారు.
భాజపా అభ్యర్థి రఘనందన్‌రావు బంధువుల వద్ద రెండు సార్లు డబ్బులు దొరికాయన్నారు. అధికార తెరాస కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని... డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా