Stalled Non Agricultural Property Registrations in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు (Non Agricultural Property Registrations) ఇవాళ ఆగిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా డాక్యుమెంట్లు స్కానింగ్ చేయడం, ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు.. సబ్ రిజిస్ట్రార్లు బయోమెట్రిక్ ద్వారా లాగిన్ కావాల్సి ఉండగా అది కూడా పని చేయలేదు. ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్లు స్కానింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొన్నారు.
ఇలా రకరకాలుగా తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 140కి పైగా సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్లు డౌన్ కావడంతో రూ.40 నుంచి రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు అధికారులు వివరించారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయవిక్రయదారులు.. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్లు డౌన్ కావడంతో క్యూలో నిల్చోని.. అసహనానికి గురయ్యారు.
REGISTRATION DEPT INCOME: కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ
Registrations Decreases in Telangana : మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. ఆశించిన మేర రానట్లు (Registrations Decreases) తెలుస్తోంది. చదరపు అడుగు మార్కెట్ విలువతో పాటు వెంచర్ల నుంచి కొనుగోలు చేసే ఖాళీ స్థలాల విలువ పెంచగా స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు.. అదే స్థాయిలో రేట్లు పెంచడంతో కొనుగోలు దారులు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. రెరా అనుమతి లేకుండా తక్కువకు విక్రయాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడంతో ఫ్రీలాన్స్, యూఎస్డీ సేల్స్ కొంతమేర తగ్గాయి.
రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు చేసే బిల్డర్లు, లేఅవుట్లు వేసే స్థిరాస్తి వ్యాపారులకి క్రెడెయ్, ట్రెడా, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సంఘాలు సభ్యత్వం ఇవ్వడం లేదు. సర్కార్ నుంచి ఒత్తిడి పెరగడంతో విధిలేక రెరాలో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ మంది చొరవ చూపుతున్నారు. ఫిబ్రవరి చివరి వరకు రాష్ట్రంలో 10.91 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,987.26 కోట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
అసైన్డ్, సీలింగ్ భూములకు గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు
గత 11 నెలల్లో వచ్చిన రాబడిని పరిశీలిస్తే నెలకు సగటున రూ.940.40 కోట్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తుండగా.. మరో రూ.240 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ద్వారా రాబడి వస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సగటున నెలకు దాదాపు రూ.1,200 కోట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మార్చిలో మరో రూ.1,200 కోట్ల వరకు వస్తుందని అంచనా వేసుకున్నా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.14,167.66 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర సర్కార్ నిర్దేశించిన రూ.15,600 కోట్లతో బేరీజు వేస్తే, 90 నుంచి 91 శాతానికి మించి రాబడి వచ్చే అవకాశం లేదని స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది.
అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్లు.. అధికారుల అక్రమాలు!
Land Market Values: మార్కెట్ విలువలు పెరిగినా... తగ్గని రిజిస్ట్రేషన్లు