ఏపీ శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ఎగువన పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న కారణంగా.. ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.
ఇప్పటికే 6 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 822.30 అడుగులు, నీటినిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది. జూరాల, హంద్రీ నుంచి 43,249 క్యూసెక్కుల ప్రాజెక్టులో కలుస్తోంది.
ఇదీ చూడండి : పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు