శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో శ్రీ రామ పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పట్టాభిషేకానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
స్వామి వారికి ఆభరణాలు సమర్ఫించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.