శ్రీగంధం సాగు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు సీఎస్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని.. కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్సులు, డీలర్షిప్ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చందనం స్మగ్లర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. రైతులు శ్రీగంధం సాగు చేయడాన్ని సీఎస్ అభినందించారు. 15 ఏళ్ల వ్యవధిలో రూ.36 లక్షల లాభాన్ని పొందినట్లు రైతులు సోమేశ్ కుమార్‌కు వివరించారు.