ETV Bharat / state

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రపంచ రికార్డులు - ప్రపంచ రికార్డులు

భారత్​, లెబనాన్, కువైట్, ఈజిప్టు దేశాలకు చెందిన ప్రపంచ రికార్డులను ఆయా దేశాల ప్రతినిధులు శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులకు ప్రదానం చేశారు. వెేర్వేరు వేదికల్లో ఒకే సమయంలో చేసిన వివిధ ప్రదర్శనలకు ఈ అవార్దులు వరించాయి.

sri chaitanya institutions students world records
శ్రీ చైతన్య విద్యార్థుల ప్రపంచ రికార్డులు
author img

By

Published : Feb 20, 2020, 1:05 AM IST

Updated : Feb 20, 2020, 8:16 AM IST

విద్యార్థుల ప్రతిభకు కొలమానం లేదని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మా బొప్పన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ్​ బంగా​, హరియాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 390 శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన 1,32,121 మంది విద్యార్థులు స్పోర్ట్స్ డ్రిల్​తో పాటు యోగా విన్యాసాలను వేర్వేరు వేదికల్లో ఒకే సమయంలో ప్రదర్శించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్​లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ దేశాలకు చెందిన ఎలైట్ ప్రపంచ రికార్డు సంస్థల సీఈఓలు రాబిన్ బల్ బాకీ, ఆనుప్ జాయ్, అహ్మద్ షబ్రి అబెదలిహలిమ్ సల్మా, ఏషియన్ రికార్డ్ అకాడమీ సీఈవో ఆదిల్ మౌనిర్ రయాద్ ఘటాస్, ఏషియన్ ఇండియా రికార్డ్స్ అకాడమీ అసోసియేట్ ఎడిటర్ పీ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుష్మా బొప్పనకు ప్రపంచ రికార్డును అందజేశారు.

విద్యార్థుల ప్రతిభకు సరైన శిక్షణ అందిస్తే వారు ఏ రంగంలోనైనా రాణించగలరనడానికి ఈ రికార్డులే నిదర్శనమని సుష్మా బొప్పన పేర్కొన్నారు. తమ సంస్థ విద్యార్థులకు అవార్డులు రావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఆయా దేశాల ప్రతి నిధులను సన్మానించారు.

శ్రీ చైతన్య విద్యార్థుల ప్రపంచ రికార్డులు

ఇదీ చదవండి: మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం

Last Updated : Feb 20, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.