ETV Bharat / state

వామపక్ష తీవ్రవాదం కట్టడికి కసరత్తు - Left-wing terrorism in Telangana

వామపక్ష తీవ్రవాదం కట్టడికి తెలంగాణ పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేహౌండ్స్‌ను బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాల్లోని పోలీసులకూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.

Special training for ts police in building left-wing terrorism
వామపక్ష తీవ్రవాదం కట్టడికి కసరత్తు
author img

By

Published : Nov 14, 2020, 8:08 AM IST

రాష్ట్రంలో పెరుగుతున్న వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గెరిల్లా పోరాటంలో ఆరితేరిన గ్రేహౌండ్స్‌ను బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాల్లోని పోలీసులకూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అవసరమైన మార్పులు చేపట్టబోతున్నారు.

కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లను అనుకొని ఉన్న జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఒక్కసారిగా పెరగడంతో పోలీసు అధికారులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణ చర్యల కింద ప్రభావిత ప్రాంతాలకు గ్రేహౌండ్స్‌ బలగాలను తరలించి విస్తృతంగా గాలింపులు చేపడుతున్నారు. దీనివల్ల మావోయిస్టుల కదలికలు, తద్వారా వారు తలపెట్టే విధ్వంసక చర్యలను అడ్డుకోవచ్చన్నది అధికారుల ఆలోచన. అయితే.. సిబ్బంది కొరత కారణంగా ఇలా నిరంతరం గ్రేహౌండ్స్‌ బలగాలతో గాలింపులు నిర్వహించడం కష్టం.

పోలీసుశాఖలోకి కొత్తగా దాదాపు 11వేల మంది కానిస్టేబుల్‌, ఎస్సై స్థాయి సిబ్బంది శిక్షణ పూర్తిచేసుకొని విధుల్లోకి చేరారు. వీరిలో కొందరిని గ్రేహౌండ్స్‌లోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే కొత్త సిబ్బందికి మరికొంత సానపట్టి వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించాలని, వారి ద్వారా గాలింపులు నిర్వహించాలని, ఏదైనా నిర్దుష్ట సమాచారం ఉన్నప్పుడు మాత్రం గ్రేహౌండ్స్‌ను రంగంలోకి దింపాలనేది ఆలోచన. తద్వారా కీలకమైన గ్రేహౌండ్స్‌కు కాస్త వెసులుబాటు దొరుకుతుందని, క్షేత్రస్థాయిలో పోలీసుల గాలింపులు నిరంతరం కొనసాగుతుండటం వల్ల కార్యకలాపాలు చేపట్టడానికి మావోయిస్టులు జంకుతారని భావిస్తున్నారు. ఇప్పటికే కొత్తగా విధుల్లో చేరుతున్న దాదాపు 250 మంది ఎస్సైలను రెండు నెలల ప్రత్యేక శిక్షణ కోసం గ్రేహౌండ్స్‌కు పిలిపిస్తున్నారు.

ఇదీ చదవండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.