ETV Bharat / state

Women's rights: మహిళా తెలుసుకో... వాటిని అధిగమించడానికి ప్రత్యేక హక్కులుంటాయ్!! - International Women's Day 2022

మనం అడుగు పెట్టని రంగం లేదు... ఎక్కడైనా దూసుకుపోగల స్థైరం, చురుకు మన సొంతం. ఇది నాణానికి ఒక వైపు..లైంగిక, వరకట్న వేధింపులు, గృహహింస...ఇది రెండో వైపు. అయితే వీటిని అధిగమించడానికీ, అడ్డుకోవడానికీ మనకు భారతదేశం చట్టాల ద్వారా కొన్ని ప్రత్యేక హక్కుల్ని ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవేంటో చూద్దామా...

Women's rights
Women's rights
author img

By

Published : Mar 8, 2022, 9:17 AM IST

  • సమానత్వ హక్కు... స్త్రీ, పురుషులెవరైనా ఒకే రకం పని చేస్తున్నప్పుడు పొందాల్సిన జీతభత్యాలూ ఇద్దరికీ ఒకేవిధంగా ఉండాలని సమాన వేతన చట్టం-1976 చెబుతోంది.
  • భారత శిక్షాస్మృతి చట్టం, సెక్షన్‌-354, సవరణ చట్టం-2013 ప్రకారం స్త్రీలను ప్రేమ పేరుతో వేధించినా, ఆమె పవిత్రతను భంగపరచడానికి ప్రయత్నించినా, అశ్లీల చిత్రాలు చూపించినా, ఆమెను వివస్త్రను చేయాలనుకున్నా, నగ్నంగా ఫొటోలు తీయాలనుకున్నా... శిక్షార్హులే. జైలు శిక్షతోపాటు జరిమానాలు విధిస్తారు.
  • భరణం పొందే హక్కు... క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, సెక్షన్‌ 125 ప్రకారం...తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్య.. భర్త నుంచి భరణం కోరవచ్చు. ఏదైనా ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తుండగా భార్య భరణం పొందొచ్చని హిందూ వివాహ చట్టం, సెక్షన్‌-24 చెబుతోంది. విడాకులు మంజూరు చేసేటప్పుడు శాశ్వత భృతి ఇప్పించమని సెక్షన్‌-25 ద్వారా అడగొచ్చు.
  • హిందూ దత్తత, భరణ చట్టం-1956, సెక్షన్‌-18 ప్రకారం... అకారణంగా భర్త వదిలివేసినా, తనపట్ల క్రూరంగా ప్రవర్తించినా, భర్త నయంకాని వ్యాధితో బాధపడుతున్నా, మరొక మహిళ/భార్యతో కలిసి నివసిస్తున్నా... ఈ కారణాలన్నీ చూపి భర్త నుంచి భార్య మనోవర్తి పొందొచ్చు. అలాగే వితంతు కోడలు తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సెక్షన్‌-19 సాయంతో మామగారి నుంచి భరణం పొందొచ్చు.
  • పనిచేసే చోట లైంగిక వేధింపుల (నిరోధక, నిషేధ పరిష్కార) చట్టం - 2013 : ప్రకారం పది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు తప్పనిసరిగా మహిళల రక్షణ కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అధికారులుండాలి. ఎవరైనా మహిళా ఉద్యోగి లైంగిక వేధింపులకు గురయ్యానని ఈ కమిటీకి ఫిర్యాదు చేస్తే.. నిజ నిర్ధారణ చేసి సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి.
  • గృహహింస నిరోధక చట్టం-2005.. స్త్రీలపై నాలుగు గోడల మధ్య జరిగే శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక హింసలను నియంత్రించడానికి దీన్ని రూపొందించారు. తల్లి, భార్య, అక్కాచెల్లెళ్లు, ఆడపిల్లలు...వీరంతా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఈ చట్టం కింద నియమితులైన రక్షణ అధికారికి ఫిర్యాదు చేస్తే వారు దాన్ని పరిష్కరించడమో లేదా కోర్టుకు నివేదించడమో చేస్తారు.భారత శిక్షాస్మృతి చట్టం (ఐపీసీ), సెక్షన్‌-498(ఎ), ప్రకారం కట్నం కోసం భర్త లేదా అతడి బంధువులు మహిళను శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తే ఆమె ఈ చట్టం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే సెక్షన్‌-304(బి) ప్రకారం దాన్ని వరకట్న మరణంగా పరిగణిస్తారు. వరకట్న నిషేధ చట్టం-1961 ప్రకారం కట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే..

మరికొన్ని...

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్‌-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్‌-13లో చెప్పిన కారణాలు చూపి విడాకులూ కోరవచ్చు. సెక్షన్‌-13 (బి) ద్వారా ఇరువురి సమ్మతితో విడాకులు పొందొచ్చు. సెక్షన్‌-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు.

న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.

భారత రాజ్యాంగం... అధికరణం-14: మహిళలకు సమానత్వ హక్కును కల్పించింది.

అధికరణం-15: మహిళలు, పిల్లలకు ప్రత్యేకచట్టాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

అధికరణం-16: ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి.

అధికరణం-19: భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛను కల్పిస్తోంది. అధికరణం-21: స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించారు.

అధికరణం-21(ఎ): బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని చెబుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.