ETV Bharat / state

నడి'వీధి'లో బతుకులు... 'గుర్తింపు' కోసం వేడుకోలు!

author img

By

Published : Jan 19, 2021, 7:54 AM IST

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా తయారైంది... హైదరాబాద్‌లో వీధి వ్యాపారుల పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన వీధి వ్యాపారులు గుర్తింపు కార్డులు లేక ఇబ్బంది పడుతుంటే... అనర్హులు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయని అధికారులు... అనర్హులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దయనీయంగా వీధి వ్యాపారుల పరిస్థితి... గుర్తింపు కార్డులు లేక ఇబ్బందులు

హైదరాబాద్‌లో వీధి వ్యాపారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయని అధికారులు... టౌన్‌ వెండర్‌ కమిటీ సభ్యులను సంప్రదించకుండా అనర్హులైన వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించకుండా ఎన్ని పథకాలు తెచ్చినా లాభం లేదని వెండర్ల అసోసియేషన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యం...

ఓ వ్యాపారి సుమారు 20 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోని ఐఎస్​సదన్‌లో రోడ్డు పక్కన పండ్లు అమ్ముతున్నాడు. జీహెచ్ఎంసీ అధికారులు అందించిన గుర్తింపు కార్డులో తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతం కాకుండా ఐఎస్​సదన్‌ నుంచి చంపాపేట్‌ వరకు వ్యాపారం చేసుకోవచ్చని రాసిచ్చారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులకు గుర్తింపు కార్డు చూపిస్తే చంపాపేట్‌కు వెళ్లాలని... అక్కడికి వెళ్తే ఆ పోలీసులు ఐఎస్​సదన్‌కు వెళ్లాలని చెబుతున్నారని వాపోయాడు. నిర్ధిష్టమైన ప్రాంతం తెలపడంలో అధికారుల నిర్లక్ష్యం... ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రేటర్‌లో వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలు అందడం లేదు. పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు 7 శాతం వడ్డీతో రూ. 10 వేల వరకు రుణం మంజూరు చేస్తారు. లబ్ధిదారులు ఈ రుణాన్ని 12 నెలలపాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి.

రుణం అందని పరిస్థితి...

నగరంలో 2 లక్షలకుపైగా వీధివ్యాపారులు ఉంటే అధికారికంగా కేవలం లక్షా 45 వేల 90 మందిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలినవారిని గుర్తించి లైసెన్స్‌లు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గుర్తించినవారిలో సుమారు 15 వేల మంది ఖాతాలో మాత్రమే నగదు పడిందని వీధి వ్యాపార సంఘాల నాయకులు చెబుతున్నారు. 20 ఏళ్ల నుంచి వీధి వ్యాపారం చేస్తున్న వారికి కూడా రుణం అందలేదనే ఆరోపణలున్నాయి.

అనుసంధానం...

ఫుడ్‌ సర్వీస్‌ కంపెనీలతో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులను అనుసంధానం చేసే ‘మై బీ డిజిటల్‌’ కార్యక్రమంపై వచ్చే నెల 4 నుంచి 22 వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బల్దియా ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లో నమోదు చేసుకోవాలంటే అందుకు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

అనుమతి తప్పనిసరి...

వ్యాపారం నిర్వహిస్తున్న ప్రాంతం, రిజిస్ట్రేషన్, ఫుడ్‌ క్వాలిటీ, ప్రభుత్వ విభాగాల అనుమతి సమర్పించాలి. వీటితోపాటు హోటల్‌ కేటగిరీలో 18 శాతం జీఎస్టీని సైతం యాప్స్‌ పరిధిలో కస్టమర్లు చెల్లించాలి. ఇందుకు అమ్మకందారులు జీఎస్టీ నెంబర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ ఆధారంగా ఆర్డర్లు తీసుకోవడం, డెలివరీ చేయడం, జీఎస్టీ, కంపెనీ ఆఫర్లు ఇలాంటి లెక్కలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేంత నైపుణ్యం వీధి వ్యాపారుల వద్ద ఉంటుందా అనేది అసలు ప్రశ్నగా తొలుస్తోంది.

ఇదీ చదవండి: 'రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.