ETV Bharat / state

ఆరువేల మంది మహిళలు... బేతంచర్లకు గీటురాళ్లు! - Bethamcherla industry women workers

బేతంచర్ల నాపరాయి అంటే ఒక బ్రాండ్‌!  ఈ కఠినమైన రాళ్లను అందంగా మలిచి దేశం నలుమూలలకు చేరవేయడం వెనుక సున్నితమైన చేతులు దాగి ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కడప జిల్లాలో ఉన్న 630 నాపరాయి పరిశ్రమల్లో వేలాది మంది మహిళలు కోత, పాలిషింగ్‌ వంటి విభాగాల్లో మగవాళ్లతో పోటీపడి చేయడం విశేషం...

ఆరువేల మంది మహిళలు... బేతంచర్లకు గీటురాళ్లు!

author img

By

Published : Feb 9, 2021, 9:58 AM IST

కఠినమైన నాపరాళ్లకు అందమైన రూపం ఇవ్వడం అంటే మాటలు కాదు. కోత, పాలిషింగ్‌ వంటివి అంత త్వరగా అబ్బే నైపుణ్యాలు కావు. పైగా ప్రమాదకరం కూడా. అందుకే మగవాళ్లు కూడా వెనకడుగు వేస్తారు. అంతటి కఠినమైన నైపుణ్యాలని కూడా సాధనతో ఔపోసన పట్టి, కోట్ల రూపాయల పరిశ్రమలో తమదైన పాత్రని పోషిస్తున్నారు మహిళలు.

‘చూసి నేర్చుకున్నాం... ఇప్పుడు మగవారితో సమానంగా ఉపాధి పొందుతున్నాం. కోత యంత్రాల దగ్గర పని అంటే ప్రమాదకరమైన పనే. కానీ ఆసక్తితో చేస్తున్నాం కనుక ఆడుతూపాడుతూనే గడిచిపోతోంది.’ అంటున్నారు అక్కడి మహిళలు. నిజానికి ఈ పనిని గతంలో జార్ఖండ్‌, బిహార్‌, ఒడిశా నుంచి వచ్చిన నిపుణులైన కూలీలు చేసేవారు. కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బనగానపల్లి పరిధిలో నాపరాయి గనులున్నాయి. సుమారుగా 630పైగా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ తయారయ్యే ‘బేతంచర్ల నాపరాయి’కి దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఇవి తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పరిశ్రమలో సుమారు ఆరు వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీళ్లంతా గుంటూరు జిల్లా బాపట్ల, కర్నూలులోని నందికొట్కూరు, మిడుతూరు, బేతంచర్ల, వెల్దుర్తి, పత్తికొండ, తుగ్గలి వంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూ అక్కడే స్థానికంగా నివాసముంటున్నారు. మొదట్లో వీరు చిన్నచిన్న పనులకే పరిమితమయ్యారు. అంటే నాపరాయి ప్యాకింగ్‌ వంటి పనులు చేసేవారు. ఇందుకుగానూ రోజుకూలీగా రూ.200 మాత్రం తీసుకునేవారు.

ఇవి చాలకపోవడంతో కొత్త నైపుణ్యాలవైపు దృష్టి సారించారు. ‘మొదట్లో మేం రాళ్ల గ్రేడింగ్‌ చేసేవాళ్లం. ఆ తర్వాత ప్యాకింగ్‌లో ఉండేవాళ్లం. కానీ మాకొచ్చే కూలీడబ్బు గిట్టుబాటు అయ్యేది కాదు. ఎక్కువ డబ్బు రావాలంటే కఠినమైన పనులు చేయాల్సిందే అనిపించింది. అందుకే కష్టమైనా యంత్రాల వద్ద పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ పనిలో కుదరాలంటే అనుభవం కావాలి. ఇందుకోసం కొన్ని నెలలుపాటూ ఇతర రాష్ట్రాల కూలీలు చేసే ఈ పనిని పరిశీలిస్తూ వచ్చాం. మధ్యలో చొరవ తీసుకుని చేసేవాళ్లం. ఎలా అయితేనేం చివరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మగవారితో సమానంగా పనిచేస్తూ పరిశ్రమల్లో మేమూ కీలకమయ్యాం. ఇప్పుడు అన్ని పనులూ చేయగలుగుతున్నాం’ అంటున్నారు బాపట్లకు చెందిన శివకుమారి. పరిశ్రమ యజమాని నమ్మి ఇచ్చిన పనిని మగవారికంటే మెరుగ్గా పూర్తి చేసి శభాష్‌ అనిపించుకుంటున్నారు. రోజూ మూడు యూనిట్లు రాయి కోత, పాలిష్‌ చేస్తున్నారు. ఇందుకు గానూ నెలకు రూ.16 వేల నుంచి రూ.20 వేలకు పైగా సంపాదిస్తున్నారు. పరిశ్రమలో పనిచేసేది తక్కువ సమయమైనా కీలకంగా మారారు. తమ ఇంటికి సైతం ఒక ఆర్థిక భరోసా అందిస్తున్నారు.

- యడ్లపాటి బసవ సురేంద్ర, లక్ష్మయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.