రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది. ముందుగా ఈ నెల 24న రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 27న జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఈ నెల 28, 29 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు నిర్వహించి.. ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల వారీగా కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని పోలింగ్ బూత్‌లను 9వేల శక్తి కేంద్రాలుగా బీజేపీ విభజించింది. ఈ శక్తి కేంద్రంగా బీజేపీ కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తుంది. ఒక్కోరోజు అసెంబ్లీలోని ఒక్కో మండలంలో సమావేశం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇవీ చదవండి: