ETV Bharat / state

'ప్రతి పోలీస్​స్టేషన్​లో సైబర్​ క్రైం ప్రత్యేక విభాగం'

author img

By

Published : Mar 26, 2021, 12:17 PM IST

ప్రతి పోలీస్​స్టేషన్​లో సైబర్​ క్రైమ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అల్వాల్​ ఇన్​స్పెక్టర్​ గంగాధర్ తెలిపారు. సైబర్​ నేరాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

cybercrime, alwal ci
అల్వాల్​ సీఐ

సైబరాబాద్ సీపీ సజ్జనార్​ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్​స్టేషన్​లో సైబర్​ క్రైమ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అల్వాల్​ ఇన్​స్పెక్టర్​ గంగాధర్ తెలిపారు. అల్వాల్​ పోలీస్​ స్టేషన్​లో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

సైబర్​ నేరాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సైబర్​ కేటుగాళ్లకు కళ్లెం వేసే.. విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఎవరైనా సైబర్​ నేరాల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే అల్వాల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

ఫేస్​బుక్​లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. డబ్బులు అడగడం, నకిలీ మాట్రిమోని ద్వారా డబ్బులు తీసుకోవడం... తక్కువ ధరకే ద్విచక్రవాహనాలు లభిస్తాయని క్యూఆర్​ కోడ్ స్కాన్ చేస్తూ.. ఉన్న అకౌంట్​లో డబ్బులు దొంగలించడం ఇలాంటివి అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయని వివరించారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.