ETV Bharat / state

Oilplam Farmers: ఆయిల్ పామ్ రైతులకు ప్రత్యేక మొబైల్ యాప్ - Oilplam plantation in telangana

Oilplam Farmers: ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌పై ఆయన ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

cs somesh kumar
cs somesh kumar
author img

By

Published : Apr 28, 2022, 10:42 PM IST

Oilplam Farmers: రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఐదులక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంపై ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

రైతులకు నాలుగైదు రెట్లు లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ తోటలను 20 లక్షల ఎకరాల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సోమేశ్ కుమార్ తెలిపారు. ప్లాంటేషన్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించిందని సీఎస్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 1,85,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను చేపట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను పెంచేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయని సీఎస్ అన్నారు.

ఇవీ చూడండి: Kishan Reddy On Kcr: 'కేసీఆర్‌.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చు'

'అవి సైనికుల అస్థిపంజరాలే'.. పరిశోధనలో సీసీఎంబీ నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.