మహాత్ముడి స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం... ఏడేళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(pocharam srinivas reddy tribute to gandhi) తెలిపారు. అహింసా మార్గంలో దేశానికి గాంధీ స్వాతంత్య్రం సాధించారని పోచారం గుర్తు చేశారు. మహాత్ముడి చూపిన బాటలో ప్రజాప్రతినిధులందరూ పయనించాలని ఆయన సూచించారు. మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి(pocharam srinivas reddy tribute to gandhi), మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోశ్, ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అప్పుడే ఆయన ఆత్మకు శాంతి
గాంధీజయంతి పవిత్రమైన రోజు అని... కులమతాలకు అతీతంగా బాపూజీ జయంతిని అంతటా నిర్వహించుకుంటారని స్పీకర్ పోచారం(pocharam srinivas reddy tribute to gandhi) తెలిపారు. అహింసా మార్గం ద్వారా శాంతియుతంగా దేశానికే స్వాతంత్యం తీసుకొచ్చిన మహనీయులు బాపూజీ అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కులమతాలకు అతీతంగా ఐక్య పోరాటం చేశారన్నారు. సమష్టి కృషితో సాధించుకున్నా స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే బాపూజీ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. అహింస మార్గం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారని... జాతిపిత సూచించిన బాటలోనే పయనిస్తూ బాపూజీ కలలను సాకారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉండి... దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా సీఎం కేసీఆర్(pocharam srinivas reddy about cm kcr) పాలిస్తున్నారని పేర్కొన్నారు. గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్యం సాధించారని గుర్తు చేశారు. అహింసా మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన రాష్ట్రాల కంటే ఏడేళ్ల వయసున్న తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన వివరించారు.
నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, మనమందరం స్వాతంత్య్ర భారతదేశంలో బాధ్యతగల వ్యక్తులం. మనందరి సమష్టి కృషితో ఈ స్వాతంత్య్ర ఫలితాలు ప్రతిఒక్కరికీ అందినప్పుడే మహాత్మగాంధీ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆ స్ఫూర్తినందుకొనే అహింసామార్గంలోనే ఏవిధంగా అయితే భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారో... మహాత్మాగాంధీ నాయకత్వంలో వేలాది మంది, లక్షలాది మంది వారిని అనుసరించారో... అదే అహింసా మార్గంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏడు సంవత్సరాల్లోనే... మహాత్మగాంధీ ఏం చెప్పారో... ఆనాడు స్వాతంత్య్రోద్యమంలోనే... అది నూటికి నూరుపాళ్లు అంకితభావంతో పరిపాలించి ఈనాడు దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. డెబ్బై సంవత్సరాల వయసున్న రాష్ట్రాలతో పోటీపడి ఇవాళ అగ్రగామిగా నిలిచింది. పేదప్రజల అవసరాలకు మనం అంకితం కావాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికీ అందుతాయి. ఆ లక్ష్యంతోనే మన సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు.
-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సభాపతి సభాపతి
ప్రముఖుల నివాళులు
బాపూజీ బాటలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప నాయకుడని... కోట్ల మందిని ఒకతాటిపైకి తీసుకొచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు పోతుందన్నారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బంగారు మైసమ్మ దేవాలయం ముందు మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితతో కలిసి జమ్మి వృక్షాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నాటారు.
ఇదీ చదవండి: మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు