రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపుకార్డులు ధరించాలని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి వెల్లడించారు. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు బయటకి వచ్చినప్పుడు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును, వాహనంపై సంస్థకు చెందిన స్టిక్కర్ను తప్పని సరిగ్గా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
సంబంధిత విద్యుత్ అధికారులు తమ ఉద్యోగులు, సిబ్బంది, తప్పనిసరిగా గుర్తింపు కార్డు... వారు ఉపయోగించే వాహనాలపై స్టికర్ ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూపరింటెండెంట్ ఇంజినీర్లకు సూచించారు. ఈ రోజు నల్గొండ పట్టణంలో పోలీస్ సిబ్బంది విద్యుత్ శాఖ కార్మికుడిపై దాడి చేసిన ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్తో మాట్లాడి, విద్యుత్ సిబ్బందిపై అకారణంగా దాడి చేసిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'