హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురా ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లో నిషేదిత హుక్కా ఫ్లేవర్స్, హుక్కా సామాగ్రి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. లక్ష రూపాయల విలువ చేసే హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: రెచ్చిపోతున్న సైబర్‌గాళ్లు.. లక్షల్లో లూఠీ