ETV Bharat / state

'హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి'

దక్షిణ భారత ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీకి అనుబంధంగా హైదరాబాద్​లో ద్రావిడ సేనను ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్​ గాలి వినోద్​ వెల్లడించారు. భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని కోరారు.

SOUTH INDIA POLITICAL JAC
హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి
author img

By

Published : Jun 7, 2020, 7:52 PM IST

హైదరాబాద్ తార్నాకలో సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నో ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాలకు విద్యా, వైద్య ,రాజకీయలతో పాటు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని జేఏసీ ఛైర్మన్​, ఓయూ ప్రొఫెసర్​ గాలి వినోద్​ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు కాపాడుకునేందుకు ద్రావిడ సేన ఆవిర్భవించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కన్వీనర్​గా దున్నా అంబేడ్కర్, కో కన్వీనర్లుగా బి.అశోక్, వి.సురేశ్, గంగాధర్, భద్ర, కల్యాణ్, వీణా వాణీలను ఎన్నుకున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధానిగా వెంటనే ప్రకటించాలని డిమాండ్​ చేశారు. సుప్రీంకోర్టు బెంచ్​ను చెన్నైలో ఏర్పాటు చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.