దేశంలోనే తొలిసారిగా టీకాస్ వ్యవస్థ పనితీరును దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. దీనితో సిగ్నల్ అంశాలను బోర్డు మీద కనిపించేలా చేస్తుంది. పూర్తిస్థాయి, తాత్కాలిక వేగాన్ని అదుపులో ఉంచేలా దోహదపడుతుంది. రైలు సిగ్నల్ పాసింగ్ను ముందస్తుగా తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ వద్ద ఉంచుకుని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోనందున ఇలాంటి ప్రమాదం జరిగిందని రైల్వే ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ టీకాస్ను పూర్తిస్థాయిలో వినియోగించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో