భారతీయ రైల్వేలో.. దక్షిణ మధ్య రైల్వే జోన్ అత్యధిక పార్శిల్ సేవల్లో మూడో స్థానం కైవసం చేసుకుంది. లాక్డౌన్ కాలంలో ప్రవేశపెట్టిన టైం టేబుల్ పార్శిల్ సర్వీసులకు అనూహ్య స్పందన ఫలితంగా డిసెంబర్ వరకు ఈ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు 194 టైం టేబుల్ పార్శిల్ సర్వీసులను నడిపింది. అందులో 438 పార్శిల్ వ్యానులు, 265 లగేజి రేట్లలో పండ్లు , మందులు, వరి ధాన్యం , గుడ్లు, చేపలు, నిమ్మకాయలు, నెయ్యి ఇతర సరకులను దేశంలోని వివిధ గమ్యస్థానాలకు చేర్చింది.
అత్యధికంగా 9,317 టన్నుల సరకుల్ని రవాణా చేయడం ద్వారా మిగిలిన జోన్లతో పొల్చితే దక్షిణ మధ్య రైల్వే మూడో స్థానాన్ని కైవసం చేసుకొంది.
దీనికి అదనంగా గతంలో ప్రయాణికుల రైళ్లలో రవాణా చేసే పాలు, పాల పదార్థాలు దిల్లీకి దూద్ దురం పేరిట 26 ప్రత్యేక రైళ్లను నడిపింది. సుమారు 173 పాల ట్యాంకర్లలో 70 లక్షల లీటర్ల పాలు రవాణా చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల వినియోగదారుల సరకు రవాణ కోసం మేడ్చల్ స్టేషన్ నుంచి కల్పించింది. కాచిగూడ నుంచి.. కొత్తగా గౌహతి మొదలైన గమ్యస్థానాలకు పార్శిల్ చేర్చింది.