Social Activist Gundala Malleswari: ఏపీలో వైసీపీకి ఓటు వేసినందుకు బాధపడుతున్నానని బెజవాడకు చెందిన సామాజిక కార్యకర్త గుండాల మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. దాచేపల్లిలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నానన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి వెయ్యి ఓట్లు వేయిస్తానని చెప్పారు.
వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నడుపుతున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.
ఒక వైసీపీ కార్యకర్తగా నేను జగన్‌కు ఓటు వేసి పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు జగన్ అధికారంలోకి రాకూడదని భగవంతుణ్ని కోరుకుంటాను. వాలంటీర్ వ్యవస్థతో ద్వితీయ శ్రేణి నాయకులకు విలువ లేకుండా పోయింది. చాలా మంది నాయకులలో అసంతృప్తి ఉంది. అన్ని కులాల ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చారు. ఒక్క సామాజిక వర్గాన్ని మాత్రమే జగన్ వెనకేసుకొస్తున్నారు. -గుండాల మల్లేశ్వరీ
ఇవీ చదవండి: