ETV Bharat / state

పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధిక రక్తపోటు - నగరీకరణపై రక్తపోటు

పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధిక రక్తపోటు అధికంగా వస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. తెలంగాణలో 14.2% మంది బాధితులు ఉన్నట్లు దేశవ్యాప్త అధ్యయనంలో వెల్లడైంది.

blood pressure
నగరీకరణపై రక్తపోటు
author img

By

Published : Jan 17, 2020, 9:43 AM IST

నగరీకరణపై అధిక రక్తపోటు విరుచుకుపడుతోంది. పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో హైబీపీ బాధితులు అధికంగా నమోదవుతున్నారు. మహిళల్లో కంటే పురుషుల్లో ఈ బాధితులు ఎక్కువ. తెలంగాణలోనూ 14.2% మందిని అధిక రక్తపోటు పీడిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. జాతీయ సగటు(11.3%) కంటే ఇది అధికం కావడం ఆందోళనకరమే.

‘టాటా సామాజిక విజ్ఞాన సంస్థ(టిస్‌) సౌజన్యంతో ‘జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 2015-16’ నివేదికలోని అంశాల ఆధారంగా డా.సౌమిత్రా ఘోష్‌, డా.మనీష్‌కుమార్‌ నిర్వహించిన అధ్యయన పత్రాన్ని తాజాగా ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. వివిధ అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల మధ్యవయస్కులు 8,11,917 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.

ముఖ్యాంశాలు..

  • అధ్యయనంలో పాల్గొన్నవారిలో 51.3% మంది 15-29 ఏళ్ల మధ్యవయస్కులే.
  • మొత్తం మందిలో మూడోవంతు పట్టణవాసులు, వీరిలో 25% మంది ఊబకాయ బాధితులు.
  • దాదాపు 48% మంది పురుషులు, 10% మంది మహిళలు పొగాకు ఉత్పత్తులు స్వీకరిస్తున్నారు.
  • 15-49 ఏళ్ల మధ్య వయస్కుల్లో తెలంగాణలో 90/140 కంటే బీపీ ఎక్కువగా ఉన్నవారు 14.2% మంది అని అంచనా.
  • దేశంలో కేరళలో తక్కువ(8.2%)గా, సిక్కింలో అత్యధికం(20.3%)గా ఈ బాధితులున్నారు.
  • రాష్ట్ర మహిళల్లో 13.6% మంది హైబీపీ బాధితులుండగా, పురుషులు 18.9% మంది.. జాతీయ స్థాయిలో మహిళలు 10.9%, పురుషులు 13.8% మంది హైబీపీతో బాధపడుతున్నారు.
  • రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అధిక రక్తపోటు బాధితులు 16.5% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.6%గా నమోదైంది. జాతీయ స్థాయిలో పట్టణాల్లో 12.5%.. పల్లెల్లో 10.6% బాధితులు ఉన్నారు.

యువతలోనూ ముప్పు...

యువతలోనూ రక్తపోటు ముప్పు తీవ్రంగా ఉందని నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన మరో అధ్యయనం వెల్లడించింది. భారతీయ వైద్య పరిశోధన సంస్థ(ఐసీఎంఆర్‌) సౌజన్యంతో నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలకు చెందిన సహ ఆచార్యుడు డా.శ్యాంసుందర్‌ జూనపూడి 2017 జూన్‌ నుంచి మూణ్నెళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో తేలిన కీలక అంశాలను వెల్లడించారు. యుక్తవయసులో హైబీపీకి ఊబకాయంతో పాటు కుటుంబంలో రక్తపోటు బాధితులుండడం కూడా ప్రధాన కారణమేనని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని రెండు డిగ్రీ కళాశాలలను ఎంచుకొని 17-25 ఏళ్లలోపు 100 మంది యువతపై డా.శ్యాంసుందర్‌ ఈ పరిశోధన చేశారు. సంబంధిత పరిశోధన పత్రం ఇటీవలే ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌’ వైద్యపత్రికలో ప్రచురితమైంది.

అధ్యయనానికి అంగీకరించిన వంద మందిలో 16% మంది అధిక రక్తపోటు బారినపడడానికి ముందు దశలో ఉన్నట్లుగా నిర్ధారించారు. మిగిలిన 84% మంది సాధారణ రక్తపోటుతో ఉన్నారు.

ఇవీ చూడండి: కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.